చందాకొచర్‌ పాత్రపై ఆధారాలున్నాయి | Sakshi
Sakshi News home page

చందాకొచర్‌ పాత్రపై ఆధారాలున్నాయి

Published Mon, Mar 4 2019 5:06 PM

ED Questions Chanda Kochhar forFourthStraight Day  - Sakshi

సాక్షి,ముంబై : ఐసీఐసీఐ కుంభకోణంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఎండీ చందా కొచర్‌కు మరోసారి ఈడీ షాకిచ్చింది. ఈ కేసులో విచారణను వేగవంతం చేసిన దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సోమవారం కీలక ప్రకటన చేసింది. వరుసగా నాలుగవరోజు కూడా విచారించిన ఈడీ రుణాల కేటాయింపులో క్విడ్‌ ప్రోకోకు పాల్పడ్డా రనేందుకు తమ వద్ద సాక్ష్యాలు న్నాయని పేర్కొంది. వీడియోకాన్‌ గ్రూప్‌నకు1875 కోట్ల రుణాలను మంజూరులో చందా కొచర్‌ అవకవతలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై  ప్రశ్నిస్తున్న ఈడీ వరుసగా సోమవారం కూడా ప్రశ్నల పరంపరను కొనసాగించింది.

వీడియోకాన్ నుండి షెల్ కంపెనీల క్లస్టర్ ద్వారా రూ .64 కోట్లు దీపక్‌ కొచర్‌ కంపెనీ  కంపెనీకి రూ .64 కోట్లు అందాయని ఈడీ వర్గాలు  తెలిపాయి. అదే సంవత్సరంలో ఫస్ట్ ల్యాండ్ హోల్డింగ్స్ నుంచి రూ. 325 కోట్లు అందాయి.  దీపక్‌ కొచర్‌ భార్య  ఐసీఐసీఐ బ్యాంకునకు సీఎండీగా ఉన్న కాలంలోనే ఈ పరిణామాలు జరగడం అనుమానాలకు తావిచ్చిందనీ, దీనిపై మరింత దర్యాప్తు చేస్తున్నామని తెలిపాయి.

రుణాల మంజూరు  విషయంలో చందా కొచర్‌ క్విడ్‌ ప్రోకోకు పాల్పడ్డారంటూ  ఐసీఐసీఐను మోసగించడం, క్రిమినల్‌ కుట్ర ఆరోపణల పై కేసు నమోదైన నేపథ్యంలో దర్యాప్తు వేగవంతం చేసిన ఈడీ మనీ లాండరింగ్ చట్టం కింద  చందా కొచర్‌తో పాటు వీడియోకాన్‌ ప్రమోటర్‌ వేణుగోపాల్‌ ధూత్‌ నివాసాల్లో మార్చి 1వ తేదీన తొలిసారిగా సోదాలు సోదాలు  నిర్వహించిన కొన్ని వివరాలను ఆరా తీసింది.  అనంతరం విచారణకు హాజరుకావల్సిందిగా చందాకొచర్‌, భర్త దీపక్‌ కొచర్‌, వీడియోకాన్‌ మేనేజింగ్‌ డైరక్టర్‌ వేణుగోపాల్‌ ధూత్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది.  మూడ రోజైన ఆదివారం నూపవర్‌ రెన్యువబుల్స్‌లో మారిషస్‌ చెందిన ఫస్ట్ ల్యాండ్ హోల్డింగ్స్ పెట్టుబడులకు సంబంధించి ఎస్సార్‌ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు రవి రుయాయా అల్లుడు , మాటిక్స్‌ గ్రూప్ చైర్మన్ నిషాన్ కనోడియాను కూడా ఈడీ విచారింది. 

కాగా 2012లో వీడియోకాన్‌ గ్రూప్‌నకు రూ.3250కోట్ల విలువైన రుణాలను మంజూరు చేసేందుకు క్విడ్‌ప్రోకో ప్రాతిపదికన సాయం చేసినట్లు చందాకొచర్‌పై ఆరోపణల నేపథ్యంలో సీబీఐ ఇప్పటికే  కేసునమోదు చేసింది. అటు  స్వతంత్ర దర్యాప్తును నివేదికను పూర్తిగా ఆమోదించిన  ఐసీఐసీఐ బోర్డుకూడా ఆమెను పదవినుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. 

Advertisement
Advertisement